శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (21:36 IST)

కంద దుంపలను తింటే పురుషులకు ఏమవుతుందో తెలుసా?

మనం నిత్యం వాడే దుంపకూరలలో కంద గడ్డలకు ప్రత్యేకస్ధానం ఉంది. ఇది అనేక రకములైన పోషక విలువలను కలిగిఉంది. ఐతే ఈ కంద గడ్డని అప్పుడప్పుడు కాకుండా రోజువారి ఆహారంలో భాగంగా మార్చుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. అవి ఏంటో ఇప

మనం నిత్యం వాడే దుంపకూరలలో కంద గడ్డలకు ప్రత్యేకస్ధానం ఉంది. ఇది అనేక రకములైన పోషక విలువలను కలిగిఉంది. ఐతే ఈ కంద గడ్డని అప్పుడప్పుడు కాకుండా రోజువారి ఆహారంలో భాగంగా మార్చుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. కంద ఒక అధ్బుతమైన, బలవర్ధకమైన ఆహారం. దీనిలో విటమిన్ ఎ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. తరచూ దీనిని తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
2. కందలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. అంతేకాకుండా కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాక ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
3. చిన్న కందగడ్డ ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది. వీటిని తినడం వల్ల ఒబెసిటి, షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
 
4. కంద చంటి పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి మేలు చేస్తుంది. గర్భిణులకు చేసే మేలు అంతాఇంతా కాదు. పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.
 
5. పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. లేత కందకాడలని శుభ్రంగా కడిగి పులుసుగా చేసుకొని తినడం వల్ల డయేరియాను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆకలిని పెంచుతుంది. మూల వ్యాధిని తగ్గిస్తుంది.
 
6. కంద దేహ పుష్టిని కలిగిస్తుంది. అన్నింటికి మించి పురుషులలో వీర్యపుష్టిని కలగచేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.