సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (22:07 IST)

రోడ్డు పక్కన పెరిగే కాసర కాయలకి అంత పవరుందా?

Diabetes
రోడ్ల పక్కన, పొలాల గట్లుపైన, చెట్లకు అల్లుకుని తీగలతో వుంటాయి కాసర కాయల చెట్లు. వీటి కాయలులో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రక్తహీనతతో బాధపడేవారు కాసరకాయలను కూరగా చేసుకుని తింటే రక్తవృద్ధి జరుగుతుంది. కాలేయ సమస్యలను దూరం చేయడంలో కాసరకాయ మేలు చేస్తుందని చెపుతారు. ఈ కాయలు తింటుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి.
 
కాసర కాయలు తింటే ఎముక పుష్టి కూడా కలుగుతుంది. దంతాలు బలంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగల సామర్థ్యం వీటికి వుండటం వల్ల మధుమేహులు వీటిని తినవచ్చు.
 
కాసర కాయలు తింటే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులు సైతం దూరమవుతాయని చెపుతారు. ఈ కాయల్లో ఫైబర్‌తో పాటు క్యాల్షియం, విటమిన్ సి, ఐరన్ తదితర పోషకాలు వున్నాయి.