ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (14:22 IST)

బొజ్జ తగ్గాలంటే... పిప్పళ్లును వాడాలి.. ఎలాగంటే? (video)

Long pepper
బానబొట్ట, బొజ్జ తగ్గాలంటే.. బరువు తగ్గాలంటే... పిప్పళ్లు మెరుగ్గా పనిచేస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలుపుకుని ఉదయం, రాత్రి భోజనం చేసిన తర్వాత తింటే బానపొట్ట ఇట్టే కరిగిపోతుంది. అధిక బరువు సమస్య వుండదు. అలాగే బరువు సులభంగా తగ్గుతారు. పిప్పళ్ల పొడిని కషాయంలా తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. వాపులు వుండవు. 
 
పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా, పేగుల్లో పురుగులు నశిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పిప్పళ్లు స్త్రీల గర్భాశయ వ్యాధులకు దివ్యౌషధంలా ఇవి పనిచేస్తాయి. ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. బాలింతలు పిప్పళ్ళు తింటే శిశువుల్లో శారీరక ఎదుగుదల బాగుంటుంది. పిల్లలలో బుద్ధిని వికసింపజేసి, మేధాశక్తి పెరిగేలా పిప్పళ్లు దోహదపడతాయి. 
 
శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ అనే తీవ్రమైన తలనొప్పికి దివ్యౌషధంలా పనిచేయడమే గాక, గుండె ఆరోగ్యాన్ని పిప్పళ్లు కాపాడుతాయి. మూత్ర పిండాల వ్యాధులు తగ్గటానికి తోడ్పడుతాయి. పిప్పళ్ళను వేయించి పొడి చేసి, సైంధవ లవణం కలిపి అన్నంలో తింటే స్థూలకాయాన్ని నివారించవచ్చు. బాలింతరాలికి చనుబాలు వృద్ధి చెందాలంటే పిప్పళ్ళను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.