శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (14:29 IST)

మినరల్ వాటర్ తాగితే అంతే సంగతులు... ఏమౌతుందో తెలుసా? (video)

మినరల్ వాటర్ వద్దు కుండ నీరే ముద్దు.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లో వాడే మంచి నీళ్లను కాచి చల్లార్చి ఒక రాగి పాత్రలో పోసి ఉంచి ఆ నీళ్లను రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా ఆరోగ్యంగా వుంటారు. 
 
ఒకవేళ రాగిబిందెలు లేని వాళ్ళు ఒక మట్టి కుండలో కాచి చల్లార్చిన నీళ్లను పోసి అందులో ఒక రాగి ముక్కను వేసి వుంచి.. ఆ నీటిని రోజుకు నాలుగు లీటర్లైనా తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. అంతేగాకుండా.. ప్రతి గంటకి ఒక గ్లాస్ కుండనీరు తాగడం చాలా మంచిది.
 
కానీ మినరల్ వాటర్ మాత్రం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే.. శరీరానికి అవసరమైన క్యాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం లాంటి గొప్ప మినరల్స్ కుండనీటిలో అధికంగా వున్నాయి. మినరల్ వాటర్‌లో ఇవి వుండవు. ఇందులో కలిపే రసాయనాల వల్ల.. ఎముకలకు అందాల్సిన క్యాల్షియం సరిగా అందదు. అందుకే తక్కువ వయసులో ఉన్నవారికి మోకాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి.  
 
ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఎక్కువ జబ్బుల బారిన పడటం జరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లలో అమ్మబడుతున్న మినరల్ వాటర్‌ని, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని సేవించడం మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.