మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (16:32 IST)

రెడ్ రైస్ తింటే.. కొలెస్ట్రాల్ మటాష్.. డయాబెటిస్ పరార్

Red Rice
రెడ్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో ఫైబర్ ఎక్కువ. రెడ్ రైస్‌లో ఫైబర్ బాగా ఉంటుంది. కప్పు బియ్యంలో... 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఎరుపు బియ్యంలో అవి తక్కువే. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు రావు. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది.
 
ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో, గుండెకు రక్త సరఫరా సరిగ్గా సాగుతుంది. అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. ఆస్తమా నుంచీ రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. 
 
ఎర్రబియ్యంలో బ్లడ్ షుగర్‌ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి అయితే... షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్‌ను ఎర్రబియ్యం నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.