1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (15:59 IST)

తక్కువ కెలొరీలతో.. ఊబకాయానికి చెక్...!

ఇటీవల కాలంలో ఊబకాయం సమస్య అధికవుతోంది. అందుకు ముఖ్య కారణం ఎక్కువ కెలొరీలు ఉన్న ఆహారం తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇంటా బయటా టెక్నాలజీ పెరిగిపోవడంతో శారీరక శ్రమ తక్కువైంది. దీంతో కెలొరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ తక్కువై ఊబకాయం సమస్య తలెత్తుతుంది.
 
ఈ సమస్య నుంచి బయటపడాలంటే కెలొరీలు తక్కువగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. తద్వారా బాగా జీర్ణమైన ఊబకాయాన్ని దరిచేరనియ్యదు. అందుకనే మనం తినే పండ్లూ, కూరగాయలు, ఏవయినా సరే, వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటే కెలొరీలు తగ్గుతాయి. టొమాటో, పుచ్చకాయ, ద్రాక్ష, ఎండుద్రాక్షాలు వంటివాటిని నీటి శాతం ఎక్కువ. ఇలాంటి తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్టుగా అనిపిస్తాయని అధ్యయనంలో వెల్లడింది.