మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2022 (17:48 IST)

ఈ ఔషధ మొక్కలు మీ పెరట్లో వుంటే అనారోగ్యం దరిచేరదు

Aloe Vera
ప్రకృతిలో ఒనగూరిన ఎన్నో ఔషధ మొక్కలు సత్ఫలితానుల ఇస్తున్నాయి. ఈ మొక్కలు తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయి. పైగా ఇతర ప్రభావాలుండవు. ఈ మొక్కలుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కలబంద రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. చర్మం, దంత, నోటి, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
జుజుబీ పండు ఆందోళనను తగ్గిస్తుంది. కాలేయం పనితీరు పెంపొందించడానికి ఉపకరిస్తుంది.
 
అశ్వగంధకి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి.
 
గులాబీ ఒత్తిడి నుంచి వెసులుబాటు కలిగిస్తూ శరీరంలోని కణాలకు కొత్త శక్తిని ఇస్తాయి.
 
గిన్సెంగ్‌ ఔషధ మూలిక తీసుకున్న వారికి శారీరక దృఢత్వం పెరుగుతుంది. శరీరంలో కొలస్ట్రాల్‌ను నియంత్రించడానికి దోహదపడతుంది.
 
పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని, డిఎన్ఎ ఉత్పరివర్తనాలను నిరోధించవచ్చని నమ్ముతారు.
 
టీ ట్రీ ఆయిల్‌తో చర్మ సమస్యలను అడ్డుకోవచ్చు. చర్మ ఆరోగ్యం కోసం చాలా కాలంగా దీని నూనెను వాడుతున్నారు.
 
ఇవేకాకుండా తులసి వంటి ఇంకా ఎన్నో ఔషధ మొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి.