మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:49 IST)

చిరుధాన్యాలు 10 ప్రయోజనాలు

Millets
మిల్లెట్లు సూపర్ ఫుడ్స్, వీటిని చిరుధాన్యాలు అంటారు. జొన్న, రాగి, బార్లీ మొదలైనవి ఇందులో వస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చిరుధాన్యాల్లో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్-బి-6, 3, కెరోటిన్, లెసిథిన్ మొదలైన మూలకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
 
చిరుధాన్యాలు శరీరంలో ఉండే ఎసిడిటీని అంటే యాసిడ్‌ను తొలగిస్తుంది. ఎసిడిటీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.
 
చిరుధాన్యాల్లో ఉండే విటమిన్-బి3 శరీరం యొక్క జీవక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది.
 
చిరుధాన్యాలు టైప్-1, టైప్-2 డయాబెటిస్‌ను నివారించగలవు.
 
ఉబ్బసం వ్యాధికి చిరుధాన్యాలు మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయి.
 
థైరాయిడ్, యూరిక్ యాసిడ్, మూత్రపిండాలు, కాలేయం వ్యాధులు, ప్యాంక్రియాటిక్ సంబంధిత వ్యాధులను అడ్డుకుంటుంది.
 
ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 
శరీరంలోని ఫ్రీరాడికల్స్ ప్రభావాలను తగ్గించే యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
వీటిలోని కెరాటిన్ ప్రోటీన్ కాల్షియం, ఐరన్, జింక్ జుట్టు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా అవసరం.