ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:15 IST)

ఉబ్బసం వ్యాధి తగ్గేందుకు పసుపుతో చిట్కా వైద్యం, ఎలాగంటే?

turmeric
గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్మలు దగ్గు లాంటివి నివారింపబడతాయి. 
 
పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
ఇస్నోఫీలియా వ్యాధిలో పసుపు గుణం అపారం. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.
 
ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి ఆరగంట ముందు పావుస్పూను పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు తగ్గుతాయి.