మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (23:40 IST)

మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

food
కొన్ని వంటలను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదంటే తీవ్ర అనారోగ్యాన్ని తెచ్చేవిగా మారే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వేడి చేయకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ఉదయం వండిని బంగాళాదుంప కూరను సాయంత్రానికి చల్లగా అయిందని మళ్లీ వేడి చేసి దాన్ని తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.
 
పుట్టగొడుగులను మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణ సమస్య తలెత్తుతుంది.
 
చికెన్‌ను మళ్లీ వేడి చేయకూడదు. అలా చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
 
ఒకసారి ఉడికించేసిన కోడిగుడ్లును మళ్లీ వేడి చేయడం సురక్షితం కాదు.
 
వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల బాక్టీరియా విషపూరితం అవుతుంది.
 
తల్లి పాలు, పిల్లల ఆహారాన్ని మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేయకూడదు.
 
చేపలు, సీఫుడ్ ఏవైనా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిది.
 
బఫేలో తెచ్చుకున్న పదార్థాలను దేన్నీ మళ్లీ వేడి చేయవద్దు.