శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:20 IST)

పాదాల పట్ల కేర్ తీసుకుంటున్నారా?

ఎప్పుడూ హెయిర్, స్కిన్ పట్లే కేర్ తీసుకుంటున్నారా? పాదాల సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేదా?. అయితే ఈ కథనం చదవండి. రోజూ మనల్ని మోసే పాదాల గురించి పట్టించుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
పాదాల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలని..లేకుంటే ఇన్ఫెక్షన్లు తప్పవు. అందుచేత స్నానం చేస్తున్నప్పుడే రెండు నిమిషాల పాటు పాదాలను శుభ్రం చేసుకుంటే పాదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. పాదం శుభ్రం చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన రాయి కూడా ఫ్యాన్సీ షాపుల్లో అందుబాటులో ఉంది. 
 
రాత్రిపడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మట్టి, సూక్ష్మజీవులుపోయి కాలు శుభ్రపడి పాదాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు. అయితే వేళ్లమధ్యలో ఉన్న తేమను గుడ్డతో తుడుచుకుని, తడి ఆరిన తరువాతే పడుకోవాలి. అలాకాని పక్షంలో వేళ్ల మధ్యలో ఫంగస్‌, అంటువ్యాధులు సోకే అవకాశముంది.
 
బయటే కాక ఇంట్లో ఉన్నప్పుడూ చెప్పులేసుకోవడం తప్పనిసరి. ఇంటిలోపల, ఇంటి వెలుపలికి వేరు వేరు చెప్పులు వాడటం మంచి ఆరోగ్య సూత్రం.
 
మనం వాడే బూట్లకు రోజు మార్చి రోజు సెలవు ఇవ్వాలి. అంటే ఒకరోజు వాడి రెండో రోజు వాడకపోవడం. బూటులోపల తడి ఆరడానికి ఈ సెలవు పనిచేస్తుంది. తడిఆరని బూట్లు, సాక్సుల వల్ల పాదానికి ఫంగల్‌ అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. రోజూ సాక్స్‌ను మార్చాలి. ఒకేసాక్సు ఎక్కువ రోజులు వాడకూడదు.
 
రోజూ కనీసం అరగంట నడవాలి. నడక కాలికి మంచిది. రక్తప్రసరణ పెంచుతుంది. తద్వారా అనేక రకాల పాదాల వ్యాధులను నివారించొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.