శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (14:28 IST)

గోళ్ల సంరక్షణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆలివ్‌ ఆయిల్‌ని కొద్దిగా వేడి చేసి దానితో గోళ్లను, వాటి చుట్టూ ఉండే మృదువైన చర్మాన్ని మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ రెండు నిమిషాలపాటు చేసుకుంటే గోళ్లు తళతళా మెరుసిపోతాయి.
 
వెన్నని కొద్దిగా వేడిచేసి దానితో కొన్ని నిమిషాలపాటు గోళ్లను మర్దనా చేసుకొని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే గోళ్లపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
 
రాత్రి పడుకునేముందు పెట్రోలియం జెల్లీ లేదా అవకాడో ఆయిల్‌తో గోళ్లకు మర్ధనా చేయాలి. దీనివల్ల గోళ్లపై మురికి, ఇతర నిర్జీవ కణాలు తొలగిపోతాయి.
 
బేబీ ఆయిల్‌తో గోళ్లను రుద్దుకోవడం వల్ల వాటిలోని పొడిదనం, పగళ్లు ఏర్పడడం క్రమేణా తగ్గిపోతుంది.
 
ఆహారంలో టొమాటో, ఫిష్‌ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల గోళ్లలో పొడిదనం వంటివిపోయి ఆరోగ్యంగా తయారవుతాయి.