చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి

Last Updated: మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:23 IST)
చుండ్రుని పోగొట్టుకోవడం కోసం చాలామంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే దీన్ని పోగొట్టుకోవచ్చు. జుట్టుని ఓ సారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకి మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.

మూడు నుంచి అయిదు చెంచాల కొబ్బరి నూనెని రాత్రి పడుకునే ముందు మాడుకి బాగా పట్టించాలి. ఉదయం తక్కువ గాఢత కలిగిన షాంపూతో స్నానం చేయాలి. ఇలా ప్రతి మూడు రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది.

రెండు చెంచాల నిమ్మరసాన్ని మాడుకి తగిలేలా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. తరువాత కప్పు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం వేసి జుట్టకి పట్టించి వదిలేయాలి. నిమ్మలోని ఆమ్లతత్వం చుండ్రు పట్టకుండా చూస్తుంది.

అల్లం ముక్కని పేస్టులా చేసి, దానికి కాస్త తేనె కలిపి మాడుకి పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అల్లంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకి కారణమైన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. జుట్టుని మృదువుగా మారుస్తాయి.
దీనిపై మరింత చదవండి :