మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (22:55 IST)

క్యారెట్ రసం తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటి?

Juice
జలుబు, విష జ్వరాలను నివారించడంలో క్యారెట్ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ ఎ, కెరోటిన్ రూపంలో వుంటుంది. క్యారెట్ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది.

 
మొటిమలు రాకుండా అడ్డుకోవడంలో క్యారెట్ రసం సాయపడుతుంది. క్లోరిన్, సల్ఫర్ క్యారెట్ రసంలో వుండటం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరుకు క్యారెట్ రసం దోహదపడుతుంది.

 
ఎముకలు, కీళ్లు బలంగా వుండేందుకు క్యారెట్ రసం తీసుకుంటుండాలి. సున్నం భాస్వరం, మెగ్నీషియంలు క్యారెట్లో వుంటాయి. ఎముకల బలానికి, గుండె కండరాల ఆరోగ్యానికి ఇవి సాయపడతాయి. అలాగే మెగ్నీషియం వల్ల కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తాయి.