సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 13 డిశెంబరు 2021 (21:20 IST)

రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఈ రసం తాగితే...

కూరగాయల్లో రసంలా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే మేలు చేకూరుతుంది. రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీపండ్ల రసాన్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు సేవించాలి. ఇలా రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడుతలు మాయం అవుతాయంటున్నారు వైద్యులు.

 
నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుందని చెపుతున్నారు నిపుణులు. క్యారెట్టు రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం మరియు మలబద్దకం దూరమవుతాయి.

 
క్యారెట్‌ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత ఒక కప్పు రసంలో ఒక చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మటుమాయం అవుతుందంటున్నారు వైద్యులు.