మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2020 (22:17 IST)

ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే?

1. ఉల్లిపాయల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే వాయు రోగాలు తగ్గిపోతాయి.
 
2. ఉల్లిని రోజూ తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పళ్లు బలపడతాయి. చిగుళ్లలోని క్రిములు నశిస్తాయి. 
 
3. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే మంచి బలం చేకూరుతుంది. 
 
4. ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలను అడ్డుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు.
 
5. ఉల్లిపాయల రసంతో తేనె కలిపి తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
6. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. 
 
7. ఉల్లిపాయ రసంతో మెహందీ, సోపు కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పిత్త సంబంధిత వ్యాధులు ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి.