బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By వరుణ్

చిరంజీవి అభిమాని అని బాబీకి ఛాన్స్ ఇవ్వలేదు : మెగాస్టార్

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్ర "వాల్తేరు వీరయ్య". ఈ నెల 13వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి వైజాగ్ కేంద్రంగా ప్రిరీలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, "చిరంజీవి అని భావించి బాబీకి ఈ చిత్రం దర్శకత్వం వహించేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. 
 
బాబీ నా దగ్గరికి వచ్చి తొలి సిట్టింగులోనే కథ వినిపించినపుడు ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పాను. ఫస్ట్ టైమ్ కథ వినగానే నాకు నచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది" అని అన్నారు. 
 
ఒక కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమా విషయంలో బాబీ నిరంతరం కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే పనిని ప్రేమిస్తారో.. ఎవరైతో కష్టాన్ని నమ్ముకుంటారో అలాంటివారు నాకు అభిమానులు. వారికి నేను అభిమానిని. రెండేళ్లుగా బాబీ కష్టాన్ని చూస్తూ వచ్చిన నేను ఆయన అభిమానినయ్యాను అంటూ చిరంజీవి దర్శకుడు బాబీని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.
 
అలాగే బాబీ ఒక మంచి దర్శకుడు మాత్రమే కాదు. మంచి రచయిత. స్క్రీన్ ప్లే రైటర్ కూడా. అభిమాని కదా అని నేను సినిమా ఇవ్వలేదు. ఆయన టాలెంట్ నచ్చి ఈ సినిమాను ఇచ్చాను. ఈ సినిమాను నేను చూశాను. ప్రతి ఒక్కరినీ ఆలరిస్తుంది అన్నారు.