పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)
ది జంగిల్ బుక్ దర్శకుడు జోన్ ఫ్రావే ది లయన్ కింగ్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ యానిమేషన్ ఫిల్మ్ ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో, 3డీ యానిమేషన్‌లో అదే పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్రోవార్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫప్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి.