ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 అక్టోబరు 2022 (16:23 IST)

గోల్డెన్ మిల్క్ అద్భుత ప్రయోజనాలు

golden Milk
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

 
పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారు చేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి.

 
తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్‌పై వేడి చేసి అందులో పసుపు వేయాలి. మీరు పాలను వేడి చేసేటప్పుడు పసుపు, యాలకులు కూడా వేయవచ్చు. ముందు చెప్పుకున్న ఆరోగ్య చిట్కాలు ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించండి