బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 సెప్టెంబరు 2022 (23:23 IST)

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మసాలా చాయ్, ఎలా చేయాలి?

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా వుంటే రక్తప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది. ప్రాణ వాయువు ఊపరితిత్తుల ద్వారా సజావుగా వెల్తుంటే ఎలాంటి అనారోగ్య సమస్య రాదు. అందుకే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం కొన్ని సాధారణ పానీయాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
 
అల్లం, తేనె, నిమ్మకాయ టీ
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కాస్త తేనె వేసుకుని తాగుతుంటే లంగ్స్ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే అల్లం టీ కూడా. నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.
 
గ్రీన్ టీ
సహజంగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ తీసుకుంటుంటారు. అయితే, ఈ హెర్బల్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, ఇది ఊపిరితిత్తులలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని తెలుసుకోవాలి.
 
మసాలా చాయ్
మసాలా చాయ్ తాగితే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గుతాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అల్లం, దాల్చినచెక్క, లవంగం, నల్ల మిరియాలు, ఏలకులు, తులసితో కూడిన మసాలా చాయ్ తీసుకుంటుంటే బహుళ ప్రయోజనాలను అందిస్తుంది.
 
మేజిక్ లంగ్స్ టీ
ఇది ఒక సాధారణ పానీయం, దీనిని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు అల్లం, దాల్చిన చెక్క, తులసి ఆకులు, ఒరేగానో ఆకులు, ఏలకులు, సోపు గింజలు, అజ్వైన్, జీరా.