సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 అక్టోబరు 2022 (22:49 IST)

అబ్బో నోటి దుర్వాసన, వదిలించుకునేదెలా?

చాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. నలుగురు కలిసిన చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఐతే చిన్నచిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. నోటి దుర్వాసనకు సహజ పద్ధతిలో నివారణ ఉపాయాలు ఏమిటో చూద్దాం.
 
పుష్కలంగా నీరు తాగాలి- నీరు నోటి లోపల క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది నోటి దుర్వాసనను అరికడుతుంది.
 
సోంపు - సోంపు తీసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది.
 
పుదీనా- మంచి మౌత్ ఫ్రెషనర్‌లలో పుదీనా ముఖ్యమైనది.
 
లవంగాలు- లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
దాల్చిన చెక్క- దాల్చిన చెక్క ముక్కలను నీటిలో వేసి మరిగించి మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు.
 
ఏలకులు- నోటి దుర్వాసన ఉంటే నోటిలో ఏలకులు ఉంచండి.
 
సిట్రస్ పండ్లు - నారింజ, నిమ్మకాయలు లాలాజల గ్రంధిని ప్రేరేపిస్తాయి. చాలా లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి.
 
కొత్తిమీర- భోజనం తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
 
ఐతే ఆరోగ్య చిట్కాలను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి.