మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (11:23 IST)

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు : నలుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
తూర్పు వాషింగ్టన్‌లోని ఫిన్లీలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో మృతి చెందిన బెంటన్‌ కౌంటీనే ఫైరింగ్‌కు పాల్పడి ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్‌ల్యాండ్‌లో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్టుగా కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ చెప్పారు. నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాలిపోయిన ట్రక్కులో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రెండు మృతదేహాలను మరో ఇంట్లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ సాగుతుందని కెన్నెవిక్ పోలీసులు పేర్కొన్నారు.