శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (11:54 IST)

పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 87మంది మృతి, 82మందికి గాయాలు

floods
పాకిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా దాదాపు 87 మంది మరణించారు. మరో 82 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) తెలిపింది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 2,715 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయని, నిర్మాణ పతనం, పిడుగుపాటు, వరదల కారణంగా చాలా మంది ప్రజలు మరణించారని ఎన్డీఎంఏ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
దేశంలోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో అత్యధిక నష్టాలు, ప్రాణనష్టాలు నమోదయ్యాయి. అక్కడ కుండపోత వర్షాల కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 53 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో 25 మరణాలు, ఎనిమిది గాయాలు నమోదయ్యాయి. ఎన్డీఎంఏ 
 
నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మొత్తం 15 మంది మరణించారు. పది మంది గాయపడ్డారు. అయితే ఈ కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా 11 మంది మరణించారు.