సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (17:35 IST)

పిల్లిని స్పీడ్ పోస్టు ద్వారా పంపిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే?

ఓ పెంపుడు పిల్లిని పెంచుకోవడం కష్టతరం కావడంతో ఓ వ్యక్తి స్పీడ్ పోస్టులో ప్యాక్ చేసి పంపాడు. దీంతో ఆ వ్యక్తిపై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్టె పెట్టేలో ఓ పిల్లిని వుంచి ఓ జిల్లాలోని జూకు పంపాడు 33 ఏళ్ల యాంగ్ అనే వ్యక్తి. పిల్లిని ఇలా బాక్సులో వుంచి స్పీడ్ పోస్ట్ పంపడం ద్వారా తైవాన్ జంతు భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీసులు తెలిపారు. 
 
అందుచేత 60వేల న్యూ తైవాన్ డాలర్ల జరిమానాను యాంగ్‌కు విధించడం జరిగింది. ఈ పిల్లిని అట్ట పెట్టె నుంచి బయటికి తీసి యాంటీ-బయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. అంతేగాకుండా.. పోలీసులు, జంతు సంరక్షణ కేంద్రం అధికారులు యాంగ్‌ను విచారించగా.. పిల్లిని పెంచడం కష్టతరంగా మారిందని.. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే.. జంతు సంరక్షణ కేంద్రానికి పోస్టు ద్వారా పంపాపని చెప్పాడు.