సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (15:18 IST)

కొత్త హీరోయిన్‌పై కన్నేసిన 'డియర్ కామ్రేడ్'

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రం షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈయన గతంలో ఓనమాలు, 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు'తో కలిసి దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. 
 
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. చివరకు కేథరిన్‌ను ఎంచుకున్నారనేది తాజా సమాచారం. గ్లామర్‌పరంగా తెలుగులో మంచి మార్కులు కొట్టేసిన కేథరిన్.. 'నేనే రాజు నేనే మంత్రి'తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రాంతిమాధవ్ మూవీలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.