శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (15:34 IST)

శృంగారంలో పాల్గొనాలి కానీ గర్భంరాకూడదు.. ఏం చేయాలి?

చాలామంది నవ దంపతులు శృంగారంలో పాల్గొంటే గర్భంవస్తుందన్న భయంతో శారీరకంగా కలిసేందుకు ఇష్టపడరు. నిజానికి శృంగారంలో పాల్గొన్నప్పటికీ గర్భంరాకుండా ఉండేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కానీ, అలాంటి వాటికి ఇష్టపడని కొందరు దంపతులు శారీరకంగా కలవకుండానే రోజులు గడిపేస్తుంటారు. పైగా, రోజూ కలవడం వల్ల ఖచ్చితంగా గర్భం వస్తుందన్న భయం వారిలో నెలకొంటుంది. ఇలాంటి వారు శారీరకంగా కలిసినప్పటికీ గర్భంరాకుండా ఉండాలంటే ఏంచేయాలన్న దానిపై వైద్యులను సంప్రదిస్తే...
 
శారీకంగా కలిస్తే గర్భంవస్తుందన్న భయంతో గడపాల్సిన అవసరంలేదని వైద్యులు చెపుతున్నారు. ముఖ్యంగా, రుతుస్రావం తర్వాత గర్భం వచ్చే రోజులను అంచనా వేసుకుని శృంగారానికి దూరంగా ఉంటారు. దీన్నే సేఫ్‌ పిరియడ్‌ టెక్నిక్‌ అని అంటారు. అయితే దీన్ని ఆధారం చేసుకుని కలయికలో పాల్గొనడం అనేది ఏ మాత్రం సురక్షితం కాదు. 
 
సాధారణంగా అండం నెలసరి వచ్చిన తర్వాత 12 -15 రోజుల్లో విడుదల అవుతుంది. అంటే నెలసరి వచ్చిన మొదటి రోజు నుంచి లెక్కపెట్టుకోవాలి. అలా అండం విడుదలయ్యేందుకు 5 రోజుల ముందు ఆ తర్వాత అసురక్షితం కాబట్టి అప్పుడు దూరంగా ఉండాలి. నెలసరి సక్రమంగా వస్తూ... అండం కూడా అనుకున్న తేదీల్లోనే విడుదల అవుతోంటే ఈ జాగ్రత్త తీసుకోవచ్చు. 
 
అయితే ప్రతీసారి ఇలాగే అవుతుందని చెప్పలేం. ఒత్తిడి, జీవనవిధానం, ఇతర కారణాల వల్ల అండం విడుదల ఆలస్యం కావచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నా కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల శారీరకంగా కలిసినా గర్భందాల్చకుండా ఉండాలంటే గర్భనిరోధక మాత్రలతో పాటు.. కండోమ్స్‌ను ఉపయోగించడమే ఉత్తమని వైద్యులు సలహా ఇస్తున్నారు.