శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (14:18 IST)

టమోటా రసం లేదా వెల్లుల్లి రసాన్ని అక్కడ రాస్తే...

ఇటీవల కాలంలో చాలామంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి అనేక రకములైన క్రీమ్‌లు, మందులు వాడుతున్నారు. అందువల్ల చర్మం పాడైపోతుంది. అలాకాకుండా సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతో మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. కాబట్టి ముఖాన్ని ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి.
 
2. కొంచెం నీటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పేస్టులా చేసుకుని మొటిమలకు పట్టిస్తే మంచి ఫలితం కనబడుతుంది.
 
3. అంతేకాకుండా మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.
 
4. టమోటా పండు రసం తీసీ మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
 
5. కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు.
 
6. మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తేనె, చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి. మొటిమలు మీద వెల్లుల్లి రసం రాయడం వల్ల వీటిని నివారించవచ్చు.