సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (15:10 IST)

"భార్యల మార్పిడి"పై నిషేధం.. అంతా కరోనా ఎఫెక్ట్.. బెల్జియం కఠిన నిర్ణయం

భార్యల మార్పిడిని తమ దేశ సంస్కృతిలో భాగంగా భావించే బెల్జియం దేశానికి యూరోప్ సెక్స్ క్యాపిటల్ అని కూడా పేరుంది. అంతే కాదు బెల్జియం అంటే బీర్బలుల దేశంగా అంటే బీర్‌ను అధికంగా సేవించే ప్రజలున్న దేశంగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో బెల్జియం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వైఫ్ స్వాపింగ్‌కు స్వస్తి చెప్పాలని దేశ ప్రజలకు బెల్జియం ఆరోగ్య మంత్రి డే బ్లాక్ విజ్ఞప్తి చేశారు. 
 
తమ తమ ఇళ్లల్లో ఇద్దరికి మించి ఎవరూ శృంగారంలో పాల్గొనవద్దని, కోవిడ్ -19 వైరస్‌పై పోరాటంలో భాగంగా సామాజిక దూరం పాటించాలని, అందువల్ల ముగ్గురు లేదా అంతకు మించిన వారు పాల్గొనే 'నాన్ ఎసెన్షియల్ సెక్సువల్' కార్యకలాపాలను బెల్జియంలో నిషేధిస్తున్నామని మహిళ అయిన ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డే బ్లాక్ ఏకంగా పార్లమెంట్‌లోనే ప్రకటించింది. 
 
భార్యల మార్పిడి, అలాగే ముగ్గురుకి మించి పాల్గొనే విశృంఖల శృంగార కార్యకలాపాలు , బెల్జియం దేశం లో కోవిడ్ -19 అదుపులోకి వచ్చేంతవరకూ నిషేధిస్తున్నట్టు ఆమె పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన శృంగార నిషేధాజ్ఞలు మానవ శృంగారానికి పరిమితమని, మానవ-జంతు శృంగార కార్యకలాపాలకు ఇవి వర్తించవని ఆమె ప్రకటించటంతో మీడియా ప్రతినిధులు నిర్ఘాంత పోయారు.
 
ఇకపోతే.. 2018లో జరిగిన ఒక సర్వే ప్రకారం- బెల్జియంలోని 78 శాతం దంపతులు ''భార్యల మార్పిడి" శృంగారాన్ని బహిరంగంగానే ప్రాక్టీస్ చేస్తారని వెల్లడైంది. 19వ శతాబ్దంలో బెల్జియంను పాలించిన కింగ్ లియోపోల్డ్-II ఈ తరహా వికృత శృంగార క్రీడను తమ దేశ సంస్కృతిలో ఒక భాగంగా మార్చేసినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.