పాక్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వాయువ్య పాకిస్తాన్ నగరమైన పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ సమీపంలో మంగళవారం జరిగిన పేలుడులో చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు.
70 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. నగర శివారులో ఉన్న ఇస్లామిక్ సెమినరీని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.
తరగతులు జరుగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగుతో సెమినరీలోకి ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడులో దాదాపు ఐదు కిలోల ఐఈడీని ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.
బాంబు దాడి జరిగిన పరిసర ప్రాంతాల్ని పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లుగా ప్రకటించలేదు.