గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (10:43 IST)

వింత వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షుడు

Xi Jinping
మన దేశంపై నిత్యం కాలుదువ్వే చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ ఇపుడు ఓ అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. మెదడకు సంబంధించిన సెరిబ్రల్ అనూరిజం వ్యాధి ఆయనకు సోకినట్టు చైనా మీడియా వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా గత యేడాది ఆఖరులో ఆయన బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. 
 
నిజానికి ఈ వ్యాధి ఆయనకు 2019 నుంచే ఉన్నట్టు తేలింది. ఈ కారణంగా ఆయన చైనా పర్యటనలో ఉండగా కాస్త ఇబ్బందికి కూడా గురయ్యారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి కుర్చీలో కూర్చోవడానికి కూడా కష్టపడ్డారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై పలు పరీక్షలు నిర్వహించగా, సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది.