మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By ఎంజీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (12:24 IST)

పక్షవాతంతో బాధపడుతున్నారా?

పక్షవాతంతో బాధపడుతున్నారా?.. అయితే ఈ ఊరికి వెళ్ళండి. చేతులతో ఏ వస్తువునూ పట్టుకోలేక, కాళ్ళతో నడిచేందుకు వీలుకాక, నోట్లో నుండి మాటలు సరిగా రాక పక్షవాతం అనే జబ్బుతో లక్షలాది మంది నరకాన్ని అనుభవిస్తున్నారు.

ఆ జబ్బుతో బాధపడేవాళ్ళకు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.కుటుంబ వాతావరణమే మారిపోయి, మానసికంగా కృంగిపోయే స్థితికి చేరుకుంటారు.వేలకు వేలు , లక్షలకు లక్షలు ఖర్చు పెట్టించే ఈ జబ్బు వల్ల కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది.ఇలా ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి.

పక్షవాతం అనే ఈ జబ్బు నుండి ఉపశమనం పొందాలనుకుంటే, కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల సమీపంలోని గుండుపాపల అనే గ్రామానికి దగ్గరలోని ఉమాపతినగరం అనే చోటుకు వెళ్ళండి.

అక్కడ కొన్ని దశాబ్దాల నుండి పక్షవాత నివారణకు ఆయుర్వేద మందును ఇస్తున్నారు. వేలాది మంది పక్షవాత రోగులు వారి బాధల నుండి ఎంతో ఉపశమనం పొందారు.