ఆస్తమా వున్నవారు ఈ ఐదింటిని తింటే...? (video)
ఆస్తమా సమస్య వున్నవారికే తెలుస్తుంది దానితో పడే బాధ ఏమిటో. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఏ పనిపై ధ్యాస లేకుండా చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను వదిలించుకునేందుకు మందులు వున్నప్పటికీ ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. అలాంటి ఆహారం ఏమిటో చూద్దాం.
ఉల్లిపాయల్లో యాంటీ - ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్‌స్ట్రక్షన్ తగ్గుతుంది.
అలాగే కమలాలు, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ 'సి' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు చెపుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి.
ఇంకా యాపిల్ పండులో ఉండే ' ఫైటోకెమికల్స్' ఆస్త్మాతో ఇబ్బంది పడేవారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో 'లైకోఫిన్' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్సిడెంట్‌గా ఆస్త్మా రోగులకు మేలు చేస్తుంది.
మెగ్నీషయం పాలకూరలో వుంటుంది. ఆస్త్మా లక్షణాలను తగ్గించడంలో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తంలోనూ, టిష్యూలలోను మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘ కాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడం వలన ఆస్త్మా సమస్య తగ్గుతుంది.
రెడ్ క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువ. ఇన్‌ప్లమేషన్ తగ్గించడంలో బాగా దోహదపడుతుంది. కనుక దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి.