శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:52 IST)

అమెరికాలో తీవ్రస్థాయికి డెల్టా వైరస్.. 1800 మంది మృతి

అమెరికాలో కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్ త్వరలో తీవ్రస్థాయికి చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదని నిపుణులు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వైరస్ మన జీవితాల్లో భాగం కానున్నట్లు తెలిపారు. సోమవారం రోజున అమెరికాలో మళ్లీ లక్షపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ప్రతి రోజు సుమారు 1800 మంది మరణిస్తున్నారు. 
 
తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో ఇంకా లక్షలాది మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెషర్ భక్తి హన్సోటి అమెరికాపై రిపోర్ట్ ఇచ్చారు. ఇండియా తరహాలోనే అమెరికాలో కూడా డెల్టా తగ్గుముఖం పడుతుందని ప్రొఫెషర్ హన్సోటి తెలిపారు. పశ్చిమ యూరోప్ దేశాల్లోనూ ఇదే రకమైన ట్రెండ్ కొనసాగుతున్నట్లు చెప్పారు.