శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:35 IST)

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశాన్ని వదిలేలా లేదు. మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 27,176 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,51,087కు చేరింది.
 
ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.79 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 284 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,43,497 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 38, 012 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 75,89,12,277 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో మాత్రం 61,15,690 మందికి వ్యాక్సిన్‌ వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 3,25,22,171కు చేరింది.