ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (14:40 IST)

'డోంట్ బ్రీత్' సిరీస్ నుంచి మరో చిత్ర.. 17న రిలీజ్

గతంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన చిత్రం 'డోంట్ బ్రీత్'. ఈ చిత్రం సీక్వెల్‌గా ఇపుడు 'డోంట్ బ్రీత్ -2' పేరుతో మరో చిత్రం రానుంది. ఈ మూవీ ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మొత్తం తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లష్ భాషల్లో రిలీజ్ కానుది. ఒక్క భారతదేశంలోనే దాదాపు వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ ప్లాన్ చేసింది. 
 
హాలీవుడ్ కొత్త దర్శకుడు రోడో సాయాగ్స్ ఈ చిత్రాన్ని హార్రర్ థ్రిల్లర్ కోణంలో తెరకెక్కించారు. ఇందులో స్టీఫెన్ లాంగ్, మ్యాడ్‌లిన్ గ్రేస్‌లు తండ్రీకుమార్తెలుగా నటించారు. ముఖ్యంగా, కిడ్నాప్‌కు గురైన తన 11 యేళ్ల కుమార్తెను అంధుడైన తండ్రి ఏ విధంగా రక్షించాడు అన్నదే ఈ చిత్ర కథ. అలాగే, హీరోలో దాగివున్న అదృశ్య శక్తులేంటి? అనే అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారు. 
 
ఈ చిత్రం విడుదలపై సోనీ  పిక్చర్స్ ప్రతినిధి స్పందిస్తూ, ఈ మూవీని దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాం. వచ్చే శుక్రవారం విడుదలయ్యే ఈ చిత్రం ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తున్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.