శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (14:25 IST)

25 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్... ఎవరాయన?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అది చర్చనీయాంశమే. ఏ నిర్ణయం తీసుకున్నా అది పెను సంచలనమే. తాజాగా గత 25 యేళ్ళలో అమెరికా అధ్యక్షులుగా ఉన్న వారెవ్వరూ చేయని సాహసం ఆయన చేస్తున్నారు. ఆ సాహసం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అది చర్చనీయాంశమే. ఏ నిర్ణయం తీసుకున్నా అది పెను సంచలనమే. తాజాగా గత 25 యేళ్ళలో అమెరికా అధ్యక్షులుగా ఉన్న వారెవ్వరూ చేయని సాహసం ఆయన చేస్తున్నారు. ఆ సాహసం ఏంటో తెలుసా?
 
శనివారం నుంచి ఆయన 11 రోజుల పాటు ఏకబిగువున ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నం, పిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ పర్యటిస్తారు. ఈ టూర్‌లో భాగంగా ట్రంప్ తొలుత హవాయి చేరుకున్నారు. 
 
కాగా, దాదాపు 25 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియా దేశాల్లో 11 రోజుల పాటు పర్యటించటం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దాడి చేసిన పెరల్ హార్బర్ ప్రాంతాన్ని కూడా ట్రంప్ సందర్శించనున్నారు. ఉత్తర కొరియా సమరానికి కాలుదువ్వుతున్న వేళ ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించటం ప్రాధాన్యత సంతరించుకుంది.