ఆప్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 50మంది మృతి
ఆప్ఘనిస్థాన్‌లో భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల ఉధృతికి 50 మంది మృత్యువాత పడ్డారు. దేశంలోని 17 ప్రావిన్సులలో భారీవర్షాలు, వరదల వల్ల 50 మంది వరకు మంది మృతిచెందారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వరదల్లో మరో 15 మంది గల్లంతు కాగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల వల్ల 2,450 వరకు పశువులు మృత్యువాత పడ్డాయి.
అలాగే వరదల తాకిడికి 460 కుటుంబాల వరకు నిరాశ్రయులయ్యారు. దేశంలో మృతుల కుటుంబాలకు రూ.50వేలు, క్షతగాత్రులకు రూ.25వేలు ఇస్తామని ఆఫ్ఘన్ సర్కారు ప్రకటించింది. విపత్తు నిర్వహణ కమిటీలు వరద బాధిత కుటుంబాలకు సాయం చేస్తున్నాయి.
బాధిత కుటుంబాలకు ఆహారం, ఆహారేతర సహాయాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ హెరాత్ ప్రావిన్స్‌లో 22 మంది మృతి చెందారు. హెరాత్ తరువాత పొరుగున ఉన్న ఘోర్ ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైందని ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ నివేదించింది.