అక్కడ అమ్మాయిలే ఎక్కువ.. గర్ల్సే ఖర్చు చేస్తారట.. ఇదేం కల్చర్ బాబోయ్!
ఓ అమ్మాయిని ప్రేమించి బయటికి తీసుకెళ్లాలంటే చాలా మందికి భయం. 'ఆమె నా గర్ల్ ఫ్రెండ్' అని చెప్పుకోవడానికి సంకోచించే ఈ రోజుల్లో.. ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే చైనాలో చాలా అవమానంగా ఫీల్ అవుతారట అబ్బాయిలు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే చైనాలోని డాంగ్వాన్ నగరంలో ఒక యువకుడు ఒక్క గర్ల్ ఫ్రెండ్‌ని నిర్వాహణ చేస్తే చాలా అవమానంగా ఫీలవుతారట. అతడిని చేతకాని వాడనుకుంటారంట. ఎందుకంటే, అక్కడ ప్రతి ఒక్కరూ ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్‌ను కలిగి ఉంటారట.
ఈ విషయం తమ గర్ల్ ఫ్రెండ్‌కి తెలిసిన కూడా ఊరుకుంటారట, వారు దీనిని పట్టించుకోకపోగా తన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తారట. ఇప్పటివరకు ఎవరు కనివిని ఎరుగని విషయం ఒకటి అక్కడ జరుగుతుంది. ఏంటో తెలుసా అక్కడ బాయ్ ఫ్రెండ్స్ కోసం డబ్బుల్ని అమ్మాయిలే ఖర్చు చేస్తారు. గిఫ్టులే కాదు, అబ్బాయిలకి కావలసినవి కూడా కొనిస్తుంటామని అక్కడి అమ్మాయిలు గొప్పగా చెబుతున్నారు.
దీనికి కారణం ఏమిటంటే.. అక్కడ వంద మంది అమ్మాయిలకు 89 మంది అబ్బాయిలే ఉండడం గమనార్హం. ఈ సంస్కృతిపై చైనాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అమ్మాయిల సంఖ్య ఎక్కువ అయితే ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.