శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (17:41 IST)

చైనాకు షాకిచ్చిన భారత్ .. ఎందుకు?

india vs china
భారత యువకుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నడుచుకుంటున్న చైనాకు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఈ మేరకు తన సభ్య విమానయాన సంస్థలకు సమాచారం అందించింది. 
 
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఏప్రిల్ 20 నాటి ఆదేశంలో భారతదేశాన్ని ప్రస్తావిస్తూ 'చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు మంజూరు చేయబడిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. '10 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో కూడిన టూరిస్ట్ పర్మిట్‌లు ఇకపై చెల్లవని ఐఏటీఏ పేర్కొంది. ఐఏటీఏ అనేది 290 మంది సభ్యులతో కూడిన బహుళజాతి విమానయాన సంస్థ. ప్రపంచ విమాన ప్రయాణాలలో 80 శాతం కంటే ఎక్కువ ఈ సంస్థ ద్వారా జరుగుతుంటాయి. ఇపుడు  చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేయాలని కోరడం చైనాకు గట్టి ఎదురుదెబ్బే.