Biodata Maker
✕

ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ముగ్గురు ఇరానీయులకు ఉరిశిక్ష

Written By ఠాగూర్
Updated: సోమవారం, 9 నవంబరు 2026 (09:34 IST)
ఇరాన్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనే వారిపై ఆ దేశ పాలకులు ఉక్కుపాదం మోపుతుంటారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాల్గొన్న ముగ్గురు పౌరులను ఇరాన్ ఉరితీసింది. గత జనవరి నెలలో చోటుచేసుకున్న తీవ్ర నిరసనల సమయంలో సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారన్న అభియోగాలపై హసన్ దియోబంద్, హమీద్ కజెమి, రెజా జంగనేహ్ అనే ముగ్గురిని ఉరితీసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది.
 
టెహ్రాన్‍‌కు పశ్చిమాన ఉన్న కరాజ్ నగరంలో జరిగిన ఆందోళనల్లో ఈ ముగ్గురూ పెట్రోల్ బాంబులు (మోలోటోవ్ కాక్టెయిల్స్), గ్రెనేడ్లు విసిరారని, పదునైన ఆయుధాలు, తుపాకులు ఉపయోగించారని, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారని అక్కడి న్యాయస్థానం నిర్ధారించింది. అంతేకాకుండా, నిందితులు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో పాటు ఇతర శత్రుత్వ గ్రూపుల ఆదేశాలతో పనిచేశారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. వీరి నేరారోపణలను ఇరాన్ సుప్రీంకోర్టు సమర్థించడంతో శిక్షను అమలు చేశారు.
 
దేశంలో నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం భారీగా పెరగడంతో గతేడాది డిసెంబరులో ప్రజాందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే అవి విస్తృత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా మారి, జనవరి 8, 9 తేదీల్లో ఉధృతరూపం దాల్చాయి. ఈ ఆందోళనలు, ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ అధికార యంత్రాంగం పేర్కొంది. 
 
అయితే వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. అసలు మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. భద్రతా దళాలు నిరాయుధులైన నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు వెల్లడైన వివరాలను బీబీసీ తన కథనంలో ప్రస్తావించింది.
 
మరోవైపు, నిరసనలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు వరుసగా ఉరిశిక్షలు అమలు చేస్తుండటంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌లో మరణశిక్షల సంఖ్య భారీగా పెరుగుతుండటంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి మధ్యకాలం నుంచి ఇప్పటివరకు దేశ భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలతో కనీసం 56 మందికి మరణశిక్ష అమలు చేయగా, అందులో 27 మంది జనవరి నిరసనలతో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

థియేటర్లలో 'రామాయణ' మూవీ వీడియోలు తీస్తున్నారా.. అయితే జైలుకే

దక్షిణాది చిత్రాల్లో చేదు అనుభవాలున్నాయ్ : రాధికా ఆప్టే

'వెంకటలక్ష్మి రావే’… ప్రేమకు పదాల పట్టాభిషేకం

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

Naga Chaitanya: వృషకర్మ నుంచి స్వాగ్ అటిట్యూడ్‌తో ‘స్వాగ్ ఆఫ్ అర్జున్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments