షాకింగ్ న్యూస్: హోలీ పండుగ రోజు ఇస్కాన్ టెంపుల్‌పై దాడి
అవును. హోలీ పండుగ రోజున ఇస్కాన్ టెంపుల్‌లో దాడి జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్‌పై దుండగులు దాడి చేసి కూల్చివేశారు.
ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికిపైగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని లూటీ చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరికి గాయాలయ్యాయి.
హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ఈ దాడిని ఖండించారు.
గతేడాది కూడా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొమిల్లా టౌన్‌లో ననౌర్ దిఘీ సరస్సు సమీపంలోని దుర్గా మాత పూజా మంటపంలో ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానించినట్టు సోషల్ మీడియాలో అప్పుడు వార్తలు వ్యాపించగానే.. కొందరు హిందూ ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.