బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:24 IST)

నాగుపాము-కొండచిలువ ఫైట్.. వైరల్ అవుతున్న ఫోటో

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలైనప్పటికీ.. వీటి మధ

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలైనప్పటికీ.. వీటి మధ్య జరిగిన పోరులో ఏ ఒక్కటీ గెలవలేదు. రెండు పాముల విషం ప్రాణాంతకం కావడంతో.. వీటి మధ్య జరిగిన యుద్ధంలో రెండూ ప్రాణాలు కోల్పోయాయి. 
 
ఈ ఫైట్ ఎక్కడ జరిగిందనే విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటుచేసుకుని వుండొచ్చునని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకటిపై ఒకటి పోటీపడి పోట్లాడుకున్నాయని.. ఈ క్రమంలో విషాన్నికక్కడంతో ఇరు పాములు ప్రాణాలు కోల్పోయానని కోలెమన్ షీహీ వెల్లడించారు.