తలపై వస్త్రం ఎందుకు తల్లీ.. మెడకు చుట్టుకుని ఉరేసుకుని చచ్చిపో.. ముస్లిం టీచర్‌కు బెదిరింపులు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమదేశంలో ఇక హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమదేశంలో ఇక హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని ఉరేసుకొని చచ్చిపో అంటూ ఆమెకు బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే.. జార్జియా అట్లాంటాలోని గ్విన్నెట్ కౌంటీలో హైస్కూలో పనిచేస్తున్న మిర్హా టెలి అనే ఉపాధ్యాయురాలికి.. ‘టెలి, ఇక నీ తలపై వేసుకొనే వస్త్రాన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. ఎందుకు నువ్వు దానిని మెడకు చుట్టుకొని ఉరేసుకోవు’ అంటూ నల్లసిరాతో ఓ లేఖ ఆమెకు వచ్చింది. దీనిపై అమెరికా అని సంతకం చేసి ఉంది. ముస్లింగా తన మతవిశ్వాసం ప్రకారం తాను తలపై వస్త్రాన్ని ధరిస్తే.. ఇలాంటి బెదిరింపులు రావడం దారుణమని టెలి ఆవేదన వ్యక్తం చేసింది.
అమెరికాలో తమ కమ్యూనిటీ ఎదుర్కొనే కష్టాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నానని.. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల అమెరికా మళ్లీ గొప్ప దేశం కాబోదని టెలి తన ఫేస్ బుక్‌లో వెల్లడించింది.