మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (23:01 IST)

నేపాల్ ప్రధానికి చెంపపెట్టు .. కొత్త మ్యాప్‌ ఆమోదానికి పార్లమెంట్ తిరస్కృతి

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లోని పలు ప్రాంతాలను కలిపి నేపాల్ కొత్త మ్యాచ్‌ను రూపొందించారు. దీనికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదముద్ర వేయలేదు. దీంతో కేపీ శర్మ ఓలీకి ఓ అవమానంగా మారింది. 
 
భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లిపియాధురా ప్రాతాంలను తమ భూభాగాలుగా చూపిస్తూ నేపాల్ ఇటీవల ఓ మ్యాప్‌ను రిలీజ్ చేసింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఈ కొత్త మ్యాప్‌కు బ్రేక్ పడింది. ఈ మ్యాప్‌కు సంబంధించి పార్లమెంటు ఆమోదముద్ర వేయించడంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఘోరంగా విఫలమయ్యారు.
 
నేపాల్ కొత్తగా రూపొందించన మ్యాప్‌కు నేపాల్ కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. దీనికి రాజ్యాంగ సవరణ తప్పకుండా కావాల్సివుంది. దీంతో రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంటులో బుధవారం చర్చ జరిగింది. 
 
కానీ, మెజారిటీ సభ్యుల మద్దతును పొందడంలో కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. వివిధ పార్టీల ఏకాభిప్రాయ సాధనలో ఆయన సఫలీకృతం కాలేకపోయారు. దీంతో కొత్త మ్యాప్ కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటికైతే వాయిదా పడినట్టైంది.