సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

Nigeria honour
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆదివారం నైజీరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్‌ను ప్రదానం చేసింది. అబుజలో పర్యటనలో సందర్భంగా ప్రధాని మోడకి ఈ పురస్కారానికి అందజేశారు. 
 
కాగా, ప్రధాని మోడీకి ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెనోవో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి గుర్తుగా 'అబుజా సిటీ కీ'ని మోడీకి బహుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ఆ తర్వాత అధ్యక్షుడి భవనంలో నైజీరీయా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో ప్రధాని మోడీ సమావేశమైయ్యారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా మోడీ అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
 
విదేశీ పర్యటనలో భాగంగా తొలుత నైజీరియాలో అడుగు పెట్టిన మోడీ, అనంతరం బ్రెజిల్, గుయానాలో పర్యటించనున్నారు. ఈ నెల 21 వరకూ ఆయన విదేశీ పర్యటనలో ఉంటారు.