బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (18:46 IST)

జి-20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగింత

g20summitt
జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగింది. ఇందులో జి-20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీకరించారు. అయితే, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ఆయన స్వీకరించారు. జి20 దేశాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయమని అభివర్ణించారు. 
 
కాగా, ఈ అధ్యక్ష బాధ్యతలను డిసెంబరు ఒకటో తేదీ 2022 నుంచి డిసెంబరు ఒకటి 2023 వరకు కొనసాగుతారు. వచ్చే యేడాది భారత్‌లోనే ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. బాలిలో జరిగిన జి20 సదస్సులో సభ్య దేశాధినేతలు ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. వచ్చే భారత్‌లో జరిగే జి20 దేశాల సదస్సును వివిధ నగరాల్లో నిర్వహించేలా చూస్తామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు.