శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (15:02 IST)

మడ అడవుల్లో జి-20 శిఖరాగ్ర దేశాధినేతలు - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడీ

modi in bali
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జి-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో భాగంగా, బాలిలో 1300 ఎకరాల్లో మడ (మాంగ్రూవ్ చెట్లు) అడవులు ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే పెంచుతుంది. ఈ అడవుల్లోనే జీ20 దేశాల అధినేతలు పర్యటిస్తున్నారు. ఇందులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. 
 
ఈ సదస్సుకు హాజరైన 20 దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియా రాజధానిలోని అతిపెద్ద మడ అడవులను సందర్శించారు. వీటిని సందర్శించేందుకు ఈ దేశాధినేతలంతా క్యూకట్టారు.
modi in bali
 
వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లతో పాటు ఈ సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా దేశాధినేతలంతా సాదాసీదాగా రాగా భారత ప్రధాని మాత్రమే తన అధికారిక సూట్‌లో పాల్గొన్నారు. ఫలితంగా ఈ పర్యటనలో ఆయన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా జి20 దేశాధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు.