సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (12:39 IST)

ఎన్నారై ఉమెన్ డెంటిస్ట్ హత్య... ముక్కలు చేసి సూట్‌కేసులో కుక్కారు...

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఎన్నారై మహిళా దంతవైద్యురాలు ఒకరు దారుణ హత్యకు గురైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కులు ముక్కలుగా చేసిన సూట్‌కేసులో కుక్కారు. మృతురాలి పేరు ప్రీతిరెడ్డిగా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెయింట్‌ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కన్పించలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కానీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తుండగానే, ఆమె మృతదేహం కనిపించింది. ఆమెను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సూట్‌కేసులో కుక్కి సౌత్‌వేల్స్ ప్రాంతంలో పార్క్ చేసిన వున్న ఆమె కారులో పడేసి వెళ్లిపోయారు. 
 
అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే అనగా బుధవారం ఆమె మాజీ ప్రియుడు విష్ణు వర్థన్‌ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ హత్యపై పను అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు.
 
ప్రీతిరెడ్డి అదృశ్యం, హత్య వెనక మిస్టరీ ఉన్నట్లు భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా మెక్‌ డోనాల్డ్‌కు ప్రీతి వెళ్లినట్లు.. ఆ సమయంలో ఆమెతో పాటు విష్ణు వర్థన్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు తెలపాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.