శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (14:17 IST)

ఆస్ట్రేలియా అడవుల్లో అరుదైన పాము.. ఏడడుగుల పొడవు?

ఆస్ట్రేలియా అడవుల్లో అరుదైన వన్య ప్రాణులు, మృగాలుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా అడవుల్లో ఏడు అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. ఈ పాము ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆ

ఆస్ట్రేలియా అడవుల్లో అరుదైన వన్య ప్రాణులు, మృగాలుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా అడవుల్లో ఏడు అడుగుల పొడవైన కొండచిలువ కనిపించింది. ఈ పాము ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని అడవుల్లో తిరిగే ఈ కొండచిలువ క్వీన్స్‌ల్యాండ్ ఉత్తరాన ఉన్న కైర్న్స్ నగరానికి 345 కిలోమీటర్ల దూరంలోని వుజుల్ వుజుల్ అడవిలో కనిపించింది. ఆ సమయంలో డ్యూటీలో వున్న ఇద్దరు అధికారులకు ఈ పాము కనిపించింది. వెంటనే ఆ కొండ చిలువ ముందు నిలబడి వారు ఫోటోకు ఫోజులిచ్చారు. 
 
తమ డ్యూటీ ఎప్పుడూ బోర్ కొట్టదని.. ఎప్పుడూ ఏదో ఒకటి ఎదురుపడుతూ వుంటుందని.. కానీ అవి ఎంత ప్రమాదకరమైనవో చెప్పలేమని అధికారులు తెలిపారు. ఇకపోతే.. పాము క్రూబ్ పైథాన్ అని పిలువబడుతున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఈ ఫోటోను ఇప్పటికే 20లక్షల మంది చూశారు. కామెంట్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి.