సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మే 2024 (18:49 IST)

రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ పై భారతీయుడు -2 లో 2వ సింగిల్

Rakul Preet Singh, Siddharth
Rakul Preet Singh, Siddharth
కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం భారతీయుడు -2 , ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ జంటగా నటిస్తున్నారు. వీరిపై తీసిన చెంగళువ.. సాంగ్ ను షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. పూర్తి సాంగ్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
 
భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రం సమకాలీన పరిస్థితులపై దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. కాగా, చెంగళువ.. పాటను జేసుదాస్ ఆలపించగా, అనిరుధ్ బాణీలు సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. లైకా ప్రొడక్షన్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.